హైటెక్స్‌లో స్పోర్ట్స్ ఎక్స్‌పో ప్రారంభం
రెండు రోజుల ప్రదర్శన ప్రవేశం ఉచితం
శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (విజయక్రాం తి): నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.స్పోరట్స్, ఫిట్నెస్, న్యూట్రిషన్, వెల్నెస్ రంగాలకు సంబంధించిన ఈ రెండు రోజుల ప్రదర్శన శనివారం వరకు కొనసాగనుంది,సందర్శకులకు ప్రవే శం ఉచితం.హైటెక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 9వ ఎడిషన్ను హైటెక్స్ డైరెక్టర్ కున శంకర్, ఎన్‌ఎండీసీ డైరెక్టర్ (పర్సనల్) కృష్ణకుమార్ ఠాకూర్, హైదరాబాద్ రన్నర్స్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెట్చా కలిసి ప్రారంభించారు.
50కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటు న్నారు. క్రీడా, ఫిట్నెస్ ఉత్పత్తులు, సేవల ప్రదర్శనతో పాటు లైవ్ స్పోరట్స్ పోటీలు, డెమోన్స్ట్రేషన్లు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తయారీదారులు, బ్రాండ్లు, డిస్ట్రిబ్యూటర్లు, క్రీడాకారులు, కోచ్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు ఒకే వేదికపై కలుస్తున్నారని హైటెక్స్ డైరెక్టర్ కున శంకర్ మీడియాతో అన్నారు. ఇది కేవలం ఉత్పత్తుల ప్రదర్శనే కాదని, పోటీలు, సెమినార్లు, ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన క్రీడా వేదికగా రూపొందిం చామని తెలిపారు.
ఈ ఎక్స్పోను ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్కు కర్టెన్ రైజర్గా నిర్వహిస్తున్నారు. దేశంలో రెండో అతిపెద్ద మారథాన్గా పేరొందిన ఈ ఈవెంట్కు లక్షలాది మంది అభిమానులు, పాల్గొనేవారు వస్తుంటారు. గతేడాది ఎక్స్పోకు 25 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ను క్రీడా, ఫిట్నెస్ కేంద్రంగా మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రదర్శన కీలకమవుతుందని కున శంకర్ అన్నారు.






