అక్రమ కట్టడాలు నిలిపి వేయాలి
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతి
అబ్దుల్లాపూర్‌మెట్, మే 23 (విజయక్రాంతి): అక్రమ కట్టడాలను నిలిపి వేయాలని కోరుతూ అబ్దుల్లాపూర్‌మెట్ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్‌పేట గ్రామంలో సర్వే నెంబర్ 244 ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను నివారించాలని సీపీఎం పార్టీ తహసీల్దార్ మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ, మండలంలో భూముల రేట్లు పెరిగినందున పట్టా భూమి, ప్రభుత్వ భూమి అని తేడా లేకుండా ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పెద్ద అంబర్‌పేట 244 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి.. ఈ భూమిలో గ్రామస్థులకు ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది భూమిని రెవెన్యూ శాఖ పీవోటీ జాబితాలో చేర్చింది. కాబట్టి అక్రమంగా వెలుస్తున్న కట్టడాని నివారించి అర్హులైన పేదలకు తిరిగి భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ, గూడెం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.






