3 May, 2026 | 2:22 PM

అక్రమ ఇసుక లారీ పట్టివేత

03-05-2026 01:07 PM

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ మైనింగ్ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుకలారీని దమ్మపేట మండలపరిధిలోని అల్లిపల్లిలో ఆదివారం దమ్మపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొవ్వూరు ఇసుక ర్యాంప్ నుండి తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక లారీని అల్లిపల్లి వద్ద పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని, అక్రమ రవాణా లో వున్న ముద్దాయిలను బైండోవర్ చేయటం జరుగుతుందని దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి హెచ్చరించారు.