21 May, 2026 | 2:39 AM

అక్రమ దుకాణాలు తొలగించాలి

21-05-2026 12:06 AM

గవర్నర్‌కు మాధవరం వినతిపత్రం

కూకట్‌పల్లి, మే 20 (విజయక్రాంతి): సర్వీస్‌రోడ్‌లో అక్రమ దుకాణాలను తొలగించాలంటూ బుధవారం లోక్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు స్వచ్ఛభారత్ అభియాన్ ఫౌండర్ చైర్మన్ మాధవరం కాంతారావు వినతిపత్రం సమర్పించారు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీయూ వరకు సర్వీస్ రోడ్‌లో ఉన్న సుమారు 350 అక్రమ దుకాణాల వల్ల రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వాహనాలకు కూడా దారి దొరకడం లేదన్నారు.

ఈ సమస్యపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, డీజీపీ, ట్రాఫిక్ పోలీసులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ విధమైన ఫలితం లేకపోవడంతో గవర్నర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ కన్వీనర్ డాక్టర్ యస్ మల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.