21 May, 2026 | 2:39 AM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

21-05-2026 12:04 AM

నిరసిస్తూ రైతుల రాస్తారోకో 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), మే 20 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి నెలరోజులు కావస్తున్నప్పటికీ కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి గుమ్మల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు కాటారం ప్రధాన రహదారిపై ధన్వాడ వద్ద ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ధాన్యం విక్రయానికి తెచ్చి నెలరోజులు కావస్తున్నప్పటికీ కాంటాలు పూర్తి చేయడం లేదని,

ఫలితంగా ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింప చేయడానికి ప్రయత్నించగా, వారు ససేమిరా అన్నారు. తక్షణం తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలపడంతో పోలీసులు జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి వెంటనే లారీలు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.