calender_icon.png 3 May, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ జొన్నల నిల్వలు పట్టివేత

02-05-2025 10:28:24 PM

వ్యాపారిపై కేసు నమోదు... 

ఇచ్చోడ,(విజయక్రాంతి): మండలంలోని మాదాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన జొన్నలను పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ ఎస్సై తిరుపతి కి అందిన సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ గ్రామానికి చెందిన షేక్ సజ్జద్ అనే వ్యాపారికి సంబంధించిన రేకుల షెడ్డులో సుమారు 500 జొన్నల బ్యాగులు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని రెవెన్యూ, వ్యవసాయ అధికారుల సమక్షంలో పంచనామ నిర్వహించి, వారికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.