27 June, 2026 | 7:47 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

18-07-2025 12:14 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులచేత ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి, ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పి సీఈవో పురుషోత్తం, హౌసింగ్ పిడి, మండల పరిషత్ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించామని, ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల చేత ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి దశలవారీగా బిల్లులు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్థికంగా స్తోమత లేని మహిళలకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లయితే రుణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.