calender_icon.png 20 January, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటైనర్లలో అక్రమంగా ఆవుల రవాణా

20-01-2026 01:09:40 AM

అడ్డుకున్న హిందూ వాహిని కార్యకర్తలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన

నిర్మల్, జనవరి 19(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను సోమవారం రాత్రి హిందూ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు.కార్యకర్తలు ఆందోళన చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మల్ కేంద్రంగా కొన్ని రోజులుగా ఆవులకు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో హిందూవాహిని కార్యకర్తలు నిఘాపెట్టారు. పట్టణంలోని శివారు ప్రాంతంలో రెండు కంటైనర్లు ఆవులు ఎక్కించి తరలిస్తుండగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే హిందూ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు.

రెండు కంటైనర్లలో సుమారు 50 వరకు ఆవులు ఉన్నాయని,తమను చూసి డ్రైవర్లు పారిపోయినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న ఏఎస్పీ సాయికిరణ్‌తో పాటు పట్టణ సీఐలు ఐదుగురు ఎస్‌ఐలు పోలీసు బలగాలతో వచ్చి ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు నచ్చజెప్పి కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయం పట్టణంలో ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో వందలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. విచారణ జరిపి తప్పకుండా బాధ్యులపై చర్య తీసుకుంటామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో హిందూవాహిని కార్యకర్తలుఆందోళన విరమించారు. పట్టుకున్న లారీలను పోలీసుల సూచన మేరకు రహస్య ప్రదేశాలకు తరలించారు.