20-01-2026 01:08:31 AM
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, జనవరి 19: గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు పరిపాలన సాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ మండలం ముల్కల్లలోనీ ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పం చ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తూ పంచాయత వ్యవస్థను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు.
గ్రామస్థాయిలో ప్రజల ఆశ యాలను నెరవేర్చే బాధ్యత సర్పంచ్ లదే అని, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాలలో పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, చెన్నూర్, హాజీపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపురావు, అనిల్, శ్రీనివాస్, పి. వెంకటేష్, మహేష్, పంచాయితీ కార్యదర్శులు, డి. పి. ఎం. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.