calender_icon.png 18 February, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో ఫిర్యాదులపై తక్షణ చర్యలు

17-02-2026 12:34:02 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా వినిపించి త్వరితగతిన పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం కొనసాగింది. జోనల్ కార్యాలయంతో పాటు నార్సింగి, అమీన్పూర్, పటాన్‌చెరు, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

మొత్తం 24 వినతులు అధికారులకు అందాయి.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం జోనల్ కమిషనర్ ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు.