17-02-2026 12:35:06 AM
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): గత వారంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిం దితుడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 60 ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) ఈ చోరీలకు సూత్రధారి. అతడితో పాటు విద్యార్థులు సాయి చరణ్ (19), అశ్విన్రావు (19)లను కూడా అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ భద్రతా వ్యవస్థపై ముందస్తు అవగాహన కలిగి ఉన్న నిందితులు అర్ధరాత్రి సమయంలో క్యాంపస్‌లోకి ప్రవేశించి, సీఆర్ రావు (ఏఐఎంసీఎస్) విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.