2 July, 2026 | 12:23 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

రైతులకు నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు

30-05-2025 12:26 AM

సరఫరాల జిల్లా మేనేజర్ విమల

గద్వాల, మే 29 ( విజయక్రాంతి ) : వరి ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సరఫరాల జిల్లా మేనేజర్ విమల తెలిపారు.

గురువారం గద్వాల మండలము, లత్తిపురం గ్రామంలోని వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగానే వచ్చినందున వర్షాలు కురియడం జరు గుతుందని, దీనివల్ల ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బంది అవుతుందన్నారు .

అయినప్పటికీని రైతులకు నష్టం వాటిల్లకుండా వరి ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లర్లకు చేర వేయడం జరుగుతుందని తెలియజేశారు. వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు అదనంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు చేరవేయడం జరుగుతుందని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ట్యాబ్ ల ద్వారా ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసి సంబంధిత రైతులకు 48 గంటలలో వారి డబ్బులు వారి ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉన్న గోనె సంచులు, తార్పాలిన్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.