30 July, 2026 | 8:09 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

08-04-2026 01:24 AM

సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదిలు అన్నారు. మంగళవారం బాలాజీ గ్రాండ్ బ్యాకేట్ హాల్ లో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు.

గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వార్డులలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఇలు క్షేత్ర స్థాయిలో తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనీ తవ్విన గోతులను వెంటనే పూడ్చి, రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని. పనులపై ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంతరెడ్డి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.