8 April, 2026 | 3:08 AM

యాదగిరిగుట్టలో ఎస్‌పీఎఫ్ సిబ్బందికి 10 కిలోమీటర్ల పరుగు

08-04-2026 01:25 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 7  : ఎస్పీ ఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బందికి మంగళవారం 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు సాగిన ఈ పరుగులో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

సిబ్బందిలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించి భక్తులకు మెరుగైన భద్రత కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఇన్స్పెక్టర్ కె. శేషగిరి రావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రవి, ఏఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.