పదో తరగతి మూల్యాంకనం రెమ్యూనరేషన్ పెంచాలి
బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి
సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : గత ఎనిమిది ఏళ్ళుగా ఉపాధ్యాయులకు పదో తరగతి మూల్యంకనంలో రెమ్యునరైజేషన్ ను పెంచడం లేదని తక్షణమే రెమ్యూనరైజేషన్ ను పెంచి, కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని బిసి టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం భాష్యం జూనియర్ కళాశాలలో బిసిటియు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 90% కు పైగా బహుజన విద్యార్థులు చదువుతున్నారని మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేసేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు కొత్త పి ఆర్ సి ని ప్రకటించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే పెండింగ్ డిఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నె శంకర్ గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, బి, శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు లింగాల రవి గౌడ్, మన్నూరి నాగన్న, దొంగర మహేష్, నిమ్మల శ్రీనివాస్, బైరు వీరస్వామి, బిసిటియు నాయకులు అల్లాడి సత్యనారాయణ, సురభి శ్రీధర్, రాచకొండ నాగయ్య, ఏ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా నూతన కమిటీ ఎంపిక : బీసీ టీచర్స్ యూనియన్ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి మంగళవారం తెలిపారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులుగా బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల దేవరాజు, కోశాధికారిగా మండవ సైదులు, గౌరవ అధ్యక్షులుగా పోతురాజు నరసయ్యలు ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికైన వారిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.




