calender_icon.png 3 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలి

24-04-2025 12:49:15 AM

- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 23: వరంగల్ లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని చంపాపేట డివిజన్ లోని బుధవారం బీఆర్‌ఎస్ జెండా పండుగ నిర్వహించారు.

ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. చంపాపేటలో గాంధీ విగ్రహం వద్ద, కర్మన్ ఘాట్ లోని వైఎస్సార్ విగ్రహం వద్ద, బైరామల్ గూడలో బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..  ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న సభకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల కమిటీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.