13-11-2025 09:46:38 PM
నేరేడుచర్లలో గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు
నేరేడుచర్ల (విజయక్రాంతి): "విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనీ "ఇంపాక్ట్ ట్రైనర్స్"అవగాహన కార్యక్రమం" గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు ఆధ్వర్యంలో "ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్" వీరవెల్లి శ్రీలత(బాలిక సాధికారత), పోలిశెట్టి శ్రీధర్ (వ్యక్తిత్వ వికాసం)లు విద్యార్థులకు అవగాహన తరగతి నిర్వహించారు.
ఆధునిక పోటీప్రపంచంలో పట్టుదలతో ప్రతి విద్యార్థి గొప్ప లక్ష్యం పెట్టుకుని తమలో ఉన్న స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువులో రాణించాలని ఏ లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారో ఎవరికి వారు SWOT ఎనాలసిస్ చేసుకోవాలని అవరోధాలు అధిగమిస్తూ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, లక్ష్యం దిశగా ప్రతి అడుగు ప్రధానమైనదని అడుగు ముందుకు వేస్తూ లక్ష్యాలు చేరుకోవాలన్నారు, దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది శీతల్ దేవి, కల్పనాచావ్లా సెక్స్ స్టోరీలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ట్రైనర్స్ ని ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సన్మానించారు.