25 February, 2026 | 3:40 AM

మెట్రోకు ఇంపాక్ట్‌ఫుల్ ఇన్‌ఫ్రా లీడర్స్ అవార్డు

16-07-2024 02:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): టైమ్స్‌నౌ ఇండియా ఆధ్వ ర్యంలో ఇటీవల బెంగుళూరులో జరిగిన టైమ్స్‌నౌ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్‌లో హైదరాబాద్ మెట్రోకు టైమ్స్‌నౌ ఇండియా ఇంపాక్ట్‌ఫుల్ ఇన్‌ఫ్రా లీడర్స్ 2024 అవార్డు దక్కింది. ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ సీఎస్‌వో మురళి వరదరాజన్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా కెవీబీరెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థ ఉద్యోగులు, బృందం అంకితభావం, సమిష్టి కృషికి ఈ గుర్తింపు నిదర్శనన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో రాణించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.