24 July, 2026 | 2:34 AM

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిపై వేటు

24-07-2026 01:59 AM
  1. వినీత్ జోషి బదిలీ, నరేష్ పాల్ గంగ్వార్‌కు బాధ్యతలు
  2. నీట్ లీక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ, జూలై 23: నీట్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని తొలగించి, నరేష్ పాల్ గంగ్వార్కు బాధ్యతలు అప్పగించారు. నీట్ పేపర్ ల్పీ ఢిల్లీలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ను ఉన్నత విద్యాశాఖకు నియమించారు.

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్య వహించలని ఢిల్లీలో విద్యార్థులు, సీజేపీ నాయకులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి కీలక చర్య తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని తొలగించింది. ఆయనను విద్యా మంత్రిత్వశాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖ కు బదిలీ చేశారు. జోషి స్థానంలో నరేష్‌పాల్ గంగ్వార్‌ను నియమించారు. వీరితోపాటు వివిధ శాఖల్లో పలువురి అధికారులను కూడా బదిలీ చేశారు.