గ్రూప్ 3లో హారిజాంటల్ విధానం అమలు
04-05-2024 01:42 AM
టీఎస్‌పీఎస్‌సీ వెల్లడి
హైదరాబాద్, మే 03 (విజయక్రాంతి): గ్రూప్ పోస్టుల భర్తీలో హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. గతంలో ప్రభు త్వం జారీ చేసిన ఆదేశాల మేరకు హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, 2022 డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వర్టికల్ విధానంలో రోస్టర్ పాయింట్లను నిర్ధేశించి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అందులో పేర్కొంది. అయితే హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో గ్రూప్ 3 పోస్టుల భర్తీలో హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. 1388 గ్రూప్ పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నియామక ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసిందే.






