1 May, 2026 | 5:49 PM

రెండు రోజుల పాటు వర్షాలు

11-05-2024 12:27 AM

భారత వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్, మే 10( విజయక్రాంతి): రాజస్థాన్, కేరళ మినహా దేశమంతా వడగాలులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమ పెరగడంతో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు పడతాయని పేర్కొం ది. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హీట్‌వేవ్స్ తగ్గుము ఖం పట్టినప్పటికీ వర్షాలు అధికంగా ఉంటాయో లేదో ఇప్పడే చెప్పలేమంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని చెబుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్ర దేశ్, బీహార్, బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌తోపాటు అసోం, మేఘాలయ, సమీప రాష్ట్రాలలో పిడుగుల తో కూడిన వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడులో 67.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌లో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడలో 22.2 డిగ్రీలు రికార్డయింది. రానున్న మూడు రోజుల్లో అత్యధికంగా 39 నుంచి 43 డిగ్రీలు, అత్యల్పంగా 29 నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో బహదూర్‌పుర సర్కిల్ 10లో 5.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ 25లో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా ఫలక్‌నుమా సర్కిల్ 10లో 24.2 డిగ్రీలు రికార్డయింది. గ్రేటర్‌లో అక్కడక్కడ వర్షం పడుతుందని, రాగల మూడు రోజుల్లో అత్యధికంగా 38 నుంచి 40 డిగ్రీలు, అత్యల్పంగా 26 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది.