15 March, 2026 | 7:14 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు

22-11-2025 06:33 PM

తెలుగింటి ఆడపడుచులకు సర్కారు సారే..

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

గంగాధరలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

సర్కారు ఇచ్చిన చీరలను చూసి మురిసిన ఆడపడుచులు..

చొప్పదండి (విజయక్రాంతి): మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు మహిళలకు చీరలను అందజేశారు. అలాగే మండలంలోని గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 31,03,596 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులు, 34 మంది లబ్ధిదారులకు రూ. 8,57,500 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ వారి ఆత్మ గౌరవానికి తోడ్పాటున అందిస్తుందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు ఇందిరా మహిళా శక్తి చీరను పంపిణీ చేసేలా  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా ఉపాధి దొరికిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన చీరలను చూసి ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, బూరుగు గంగన్న,రేండ్ల రాజిరెడ్డి,గుజ్జుల బాపురెడ్డి,మంత్రి మహేందర్,గరిగంటి కరుణాకర్, బొంగని సాయన్న,పౌల్, వంగల శ్రీనివాస్,ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, అట్ల శేఖర్, దోమకొండ మహేష్, దీకొండ మధు, జితేందర్, కడారి కుమారస్వామి,బీర్ల ఆనంద్,పొత్తూరి ప్రభాకర్, మ్యాక వినోద్, కోలాపురి లక్ష్మణ్, పెద్దోళ్ల రాజేశం, గడ్డం అంజయ్య, గంగాధర ప్రవీణ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.