calender_icon.png 22 November, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఉపాధ్యాయులకు గణితంలోని మెలకులపై రెండు రోజుల శిక్షణ

22-11-2025 06:35:17 PM

మంథని (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు గణితంలోని మెళకువలపై రెండు రోజులపాటు శిక్షణ కల్పించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మంథని మండలంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి శ్రీమతి దాసరి లక్ష్మీ పాల్గొని  మాట్లాడుతూ... ఉపాధ్యాయులంతా రెండు రోజులుగా ఇవ్వబడుతున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యార్థులందరూ గణితంలో ముఖ్యంగా రాత లెక్కలలో ప్రావీణ్యం సంపాదించేలాగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాన్ని మంథని మండలంలో అన్ని పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేయాలని, తద్వారా విద్యార్థుల ప్రగతిని మెరుగుపరచాలని అదేవిధంగా జిల్లా విద్యా ప్రగతిలో మంథని ముందు స్థానంలో ఉండేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రెండు రోజులపాటు జరిగిన సమావేశాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోసం శ్రీనివాస్, ఈదులపల్లి నరసింహారావు, జె సురేష్ లు ప్రణాళిక బద్ధంగా నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ లు లోకే రాజ్ పవన్, బోగే చంద్రశేఖర్, మద్ది రాము, నారామల్ల లక్ష్మణ్ లు రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు గణితంలో మెలకువలను, అదేవిధంగా రాత లెక్కలను సాధించడంలో నూతన వ్యూహాలను ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు మల్లన్న, రాధికలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.