calender_icon.png 22 November, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

22-11-2025 06:29:42 PM

మండల వ్యవసాయ అధికారి సందీప్

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

లైసెన్స్ రెన్యువల్, సోర్స్ సర్టిఫికెట్, ఓ ఫామ్స్ ఆడ్ చేసుకోవాలి

కోనరావుపేట (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి సందీప్ హెచ్చరించారు. రబీ సీజన్ సాగు పై వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ రైతు వేదికలో శనివారం డీలర్లకు, రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. అలాగే లైసెన్సులను రెన్యూవల్‌ చేసుకోవాలని, ప్రతి షాపులో విత్తనాల ధరలు, స్టాక్‌కు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రషీదు తీసుకోవాలని తెలిపారు. రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుండే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తన రకం, సంబంధిత బిల్లును తీసుకొని బిల్లులను పంటకాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎ ఈ ఓ పద్మ, డీలర్లు పాల్గొన్నారు.