15 April, 2026 | 12:34 AM

అకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

15-02-2026 01:14 AM

శివార్చన స్టేజీని ప్రారంభించిన ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీ

రాజన్న సిరిసిల్ల/వేములవాడ, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): మహా శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన శివార్చన స్టేజిని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్  ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి శనివారం ప్రారంభించారు. కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకముందు బేబీ ఫీడింగ్ సెంటర్ ను ఇన్‌చార్జి కలెక్టర్ ప్రారంభించారు. క్యూ లైన్లలో ఏర్పాట్లు పరిశీలించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఇన్‌చార్జి కలెక్టర్ పేర్కొన్నారు.