calender_icon.png 15 February, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ స్వాములపై లాఠీచార్జి హేయం

15-02-2026 01:13:03 AM

వీహెచ్‌పీ ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): శ్రీశైలం వంటి మహా శైవ క్షేత్రంలో దర్శనానికి వచ్చిన సాధూ సం తులు, భక్తులపై లాఠీచార్జి జరగడం చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన ఘటన అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీశైలం మలన్న సన్నిధానంలో సాధూ సంతులు, శివ స్వాములపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

భక్తుల భద్రత, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైన అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాఠీలతో భక్తులను కొట్టడం అమానుషమన్నారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తుల సహనా న్ని బలహీనతగా భావిస్తే అది పాలకుల అపోహ అని, హిందూ సమాజం ఇక మౌనంగా ఉండదని, ధర్మక్షేత్రాల్లో దౌర్జ న్యం జరిగితే విశ్వహిందూ పరిషత్ నిశ్శబ్దంగా ఉండే ప్రశ్నే లేదని బాలస్వామి హెచ్చరించారు.

లాఠీచార్జికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లాఠీ ఛార్జీ ఘటన విషయంలో శ్రీశైలం దేవస్థాన నిర్వహణపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు. భవిష్యత్తులో భక్తులపై బలప్రయోగం జరగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. అలాగే రేపటి మహా శివ రాత్రిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులకు, పాలక మండలికి ఆయన సూచించారు.