18 April, 2026 | 5:33 PM

ఆకట్టుకున్న యోగ విన్యాసాలు

21-06-2025 07:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాలలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవం(International Yoga Day) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్ ఉపాధ్యాయులు విద్యార్థులచే కలిసి యోగా పిరమిడ్స్ నిర్వహించి యోగ వల్లే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.