17 July, 2026 | 2:39 PM

Breaking News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సహకారం   •   మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •  

తను జతగా లేని కథలో..

13-03-2025 01:06 AM

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘తను జతగా..’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. శరత్ చంద్ర తిరునగరి డెప్త్ ఉన్న లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి ఆకట్టుకునేలా పాడారు. ‘తను జతగా లేని కథలో, ఈ ఒంటరి పరుగెక్కడికో, తను నేరుగ తాకే సడిలో, ఈ తుంటరి స్మృతులెక్కడివో..’ అంటూ ఎమోషనల్ లవ్ సాంగ్‌గా ఈ పాట సాగుతుంది.