19-12-2025 05:30:38 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజక వర్గంలోని పేదలు వివిధ రోగాల బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్న పేదకుటుంబాలకు ఆర్థిక చేయూత కోసం అశ్వా రావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం (సెక్రటేరియట్) లో ముఖ్యమంత్రి సహాయనిధి( సీఎంఆర్ఎఫ్) కోసం స్వీకరించిన 130 దరఖాస్తులను శుక్రవారం సంబంధిత అధికారులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉపశమనాన్ని పొందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.అదేవిధంగా వైద్య చికిత్స అవసరమున్న ప్రతి అర్హత కలిగిన కుటుంబం తమ వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అందజేయాలని వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.