calender_icon.png 24 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లాలో

05-12-2024 02:05:57 AM

ఖమ్మం, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 7:28 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. ఖమ్మం నగరంతో పాటు కూసుమంచి, బోనకల్, చింతకాని, వైరా, మధిర, ఎర్రుపాలెం, సత్తుపల్లి ప్రాంతాల్లో భూమి స్పల్పంగా కంపించింది.

ఖమ్మం నగరం శ్రీరామ్ హిల్స్, కొత్తూరు, ధ్వంసలాపురం, వీడియోకాలనీ, బ్యాంక్ కాలనీ, ముస్తాఫానగర్, మామిళ్లగూడెం, బైపాస్ ఏరియా, బల్లేపల్లి, పాండురంగాపురం ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇదిలా ఉంటే ఖమ్మంలో జిల్లాలో 2012లో కూడా ఇలాగే కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. అప్పుడు రాత్రి సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. 

కొత్తగూడెం జిల్లాలో 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం 7:30 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భద్రాచలం, చర్ల, మణుగూరు, అశ్వారావుపే, అశ్వాపురం, బూర్గంపాడు, ములకలప్లి పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో భూకంపం సంభవించింది.