calender_icon.png 23 August, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాస్ సర్వే పూర్తి

05-12-2024 02:07:19 AM

95 శాతం 

విద్యార్థులు హాజరు 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): న్యాస్ సర్వే (పీఆర్‌ఎ స్) బుధవారం ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవి.నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,342 పాఠశాలల్లోని 86,258 మంది విద్యార్థులకు గానూ 82,033 (95 శాతం) మంది ఈ సర్వేకు హాజరైనట్లు తెలిపారు. 99 శాతం పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించగా.. నలభై స్కూళ్లలో అతి తక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఆ యన పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు ఈ సర్వేను మూడేళ్లకోసారి కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది.