calender_icon.png 3 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌లోకి వలసల వెల్లువ.. కాంగ్రెస్, బీఎస్పీ ఖాళీ

03-12-2025 12:00:00 AM

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి హరీష్ రావు 

గజ్వేల్, డిసెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ గారి అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గజ్వేల్ లో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, చిత్తు చిత్తుగా ఓడించాలి. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని, అందరి కష్టాలు తీరుతాయన్నారు.

కాంగ్రెస్, బీఎస్పీల నుండి వచ్చిన నాయకులకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని హరీష్ రావు సూచించారు. కాగా మాజీ ఎఫ్.డి.సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దేవి రవీందర్, గ్రామ అధ్యక్షుడు ఎక్కడ దేవి శ్రీశైలం ఆధ్వర్యంలో కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామం కాంగ్రెస్ నుండి మాజీ ఉప సర్పంచ్ గుర్రం మహేందర్, కమ్మరి రవి, బీఎస్పీ మండల్ ప్రెసిడెంట్ బక్కోళ్ల కర్ణాకర్, విలేజ్ ప్రెసిడెంట్ ఎడబాట్ల రాజు, గుర్రం పరశురాములు, గ్రామ వైస్ ప్రెసిడెంట్ పెర్క రంగస్వామి, రాగం అనిల్, రసం కార్తీక్ తదితరులు చేరారు.

గజ్వేల్ మండలం, దాతర్పల్లి సర్పంచ్ అభ్యర్థి తలారి స్వాతి స్వామి, అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, తోట గోపాలకృష్ణ, గూడూరు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సుమన్, తలారి సత్యనారాయణ, తలారి సాయిబాబా ఆధ్వర్యంలో.. జూపల్లి మధు, వనం నరేష్, కంటే ప్రశాంత్, దుబ్బల రమేష్, దుబ్బల రాజు, దుబ్బల సిద్ధూ, జూపల్లి కృష్ణ చేరారు. జగదేవ్పూర్ మండలం బండతిమ్మాపూర్ గ్రామానికి చెందిన కీసరీ నరసింహ, తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి, నాయకులు పార్టీలో చేరారు.