24 March, 2026 | 2:49 AM

పురాతన చర్చి నేపథ్యంలో..

24-03-2026 01:15 AM

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న చిత్రం ‘పళ్లిచట్టంబి’. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.

విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్; సినిమాటోగ్రఫీ: టిజో టోమీ; ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్; ప్రొడక్షన్ డిజైన్: దిలీప్‌నాథ్.