ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో..
13మంది బాలికలపై లైంగిక వేధింపులు
చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎన్‌సీసీ పేరుతో 13మంది బాలికలపై ఓ పార్టీకి చెందిన నేత లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ పార్టీకి చెందిన శిశరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాడు. ఆ స్కూల్‌లో ఎన్‌సీసీ యూనిట్ లేకపోయినప్పటికీ.. అక్కడ క్యాంప్ (ఫేక్ ఎన్‌సీసీ క్యాంప్) నిర్వహిస్తామని చెప్పాడు. క్యాంప్ నిర్వహించి ఎన్‌సీసీ యూనిట్‌కు స్కూల్ అర్హత సాధి స్తుందని నమ్మబలికాడు. అతడి మా టలు నమ్మిన స్కూల్ యాజమా న్యం ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోకుండా క్యాంప్ పెట్టేందుకు అంగీక రించింది.
ఆగస్టు 5 వరకు ఐదురోజుల పాటు నిర్వహించిన నకిలీ ఎన్‌సీసీ కాంప్‌నకు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 17 మంది బాలికలు ఉండగా 24 మంది బాలురు ఉన్నారు. క్యాంప్‌కు సంబంధించి బాలికలకు స్కూల్ మెదటి అంతస్తులోని ఆడిటోరియంలో, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. అక్కడ శివరామన్ 1౩ మంది బాలికలను లైంగికంగా వేధించాడు. బాలికలు ఆగస్టు 9న జరిగిన విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుళ్లగా.. పరువు పోతుందని భావించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలికలు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.






