17 June, 2026 | 12:08 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ఎక్సుజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

01-02-2026 12:00 AM
  1. నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
  2. జనవరి 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): జనవరి 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్య హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 23న రాత్రి కారులో పారిపోతున్న స్మగ్లర్లను అడ్డుకునే ప్రయత్నంలో.. కారును ఆపాలంటూ వెళ్లిన కానిస్టేబుల్‌ను సౌమ్యను ఢీకొట్టి పరారయ్యారు.

దీంతో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రత్యేక వైద్యుల బృం దం నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించింది. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందం ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఆమెను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. శనివారం రాత్రి 9:41 గంటలకు సౌమ్య మరణించినట్లు నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నక్షుని భాస్కర్ ప్రకటించారు.