29-06-2025 12:42:24 AM
ట్రంప్ నోట అదే మాట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట మారుస్తున్నారు. ఇది వరకు భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ఒకసారి ఒప్పుకున్న ట్రంప్.. మోదీ కలగజేసుకోవడంతో మాట మార్చారు. యుద్ధం తాను ఆపలేదని.. వాళ్లిద్దరే కూర్చొని సమస్యను పరిష్కరించుకున్నా రన్నారు. తాజాగా నాటో సదస్సులో
ట్రంప్ ఇటీవల జరిగిన ఇరాన్, ఇజ్రాయెల్.. రష్యా, ఉక్రెయిన్.. భారత్, పాక్ మధ్య యుద్ధాలను తానే ఆపానని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ ఇవన్నీ నోబుల్ ప్రైజ్ దక్కడం కోసమే చేస్తున్నారని విశ్లేషకులు గుసగుసలాడుకున్నారు.
దిల్జీత్‌ను ముంచుతున్న‘సర్దార్ జీ’
పంజాబీ సింగర్, నటుడు దిల్జీత్ దొసాంజ్‌ను తన సినిమా ‘సర్దార్ జీ 3’ కష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆ సినిమాలో పాకిస్థాన్ నటి హానియా అమీర్‌ను తీసుకోవడమే వివాదానికి దారి తీసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో పాక్ నటులను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి.
అన్నీ తెలిసి దిల్జీత్ తన సినిమాలో పాక్ నటిని ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు. పాకిస్థాన్‌లో సినిమా విడుదల కావడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.