13-07-2025 12:08:50 AM
కన్నడ ట్రబుల్ షూటర్ డీకే
కన్నడ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ దొడ్డలహల్లి కెంపెగౌడ శివకుమార్ (డీకే శివకుమార్) గురించి తెలియనివారుండరు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే ముఖ్యమంత్రి కాకున్నా ఓ సీఎంకు ఉన్న పాపులారిటీ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ గడ్డపై అధికార బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన తీరు అమోఘం. సిద్ధరామయ్య కుర్చీకి డీకేనే అసలు పోటీదారుడని అంతా అంటుంటారు. కేంద్ర బీజేపీ పెద్దలు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూ డీకే కాంగ్రెస్‌కు అధికారం దక్కేలా చేశారు.
వివాదాల రాజు ‘రాజాసింగ్’
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోధ్. హిందుత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన రాజాసింగ్ ఇటీవలే బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ భవిష్యత్‌ను ప్రారంభించిన రాజాసింగ్ కార్పొరేటర్‌గా గెలుపొంది సత్తాచాటారు. అనంతరం 2014లో కాషాయ కండువా కప్పుకుని గోషామహల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీకి తెలంగాణ గడ్డపై అధికారం చేజిక్కకున్నా రాజాసింగ్ మాత్రం 2014 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు.