calender_icon.png 13 July, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కడ ఆంధ్రా పాట..ఇక్కడ తెలంగాణ పాట!

13-07-2025 12:10:43 AM

ఏపీ బీజేపీ రెండు ‘సిత్రాల’పాట పాడుతోంది. చంద్రబాబు..రెండు కళ్ల సిద్ధాంతంలాగా అన్నమాట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమసమయంలో తనకు తెలంగాణ, ఆంధ్రా రెండు కండ్లు అని సిద్ధాంతం ప్రవచించారు. సరిగ్గా అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ రెండు చిత్రాల పాట పాడుతున్నారు. అక్కడో పాట..ఇక్కడో పాట పాడుతున్నారు. ఇటీవల ఏపీ మంత్రి నారాలోకేశ్‌ను బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కలిసి అఖండ భారతావని చిత్రపటాన్ని అందజేశారు.

అయితే అందులో తెలంగాణ రాష్ట్రం లేదు. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. దీనిపై తెలంగాణ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటై పదకొండేళ్లవుతున్నా ఇంకా తమ ఉనికిని పరిగణించడంలేదా అని!. ఈ విషయం ఎటు తిరిగి ఎటు పోతుందోనని అనుకున్నాడో ఏమో గానీ..జరిగిన పొరపాటును ఆయన సరిదిద్దుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావును కలిసి తెలంగాణతో కూడిన అఖండ భారతావని చిత్రపటాన్ని అందజేశారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగినా..అసలు అక్కడ ఆ పాటెందుకు పాడాడు..ఇక్కడ ఈ పాటెందుకు పాడాడు. ఈ రెండు సిత్రాల వెనుక ఆయన ఉద్దేశమేంటోనని చర్చ జరుగుతోంది.

 మోతే