10-02-2026 01:12:04 AM
చేవెళ్ల ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చివరిరోజు చేవెళ్ల మున్సిపల్ 15వ వార్డు కాంగెస్‌అభ్యర్థి బండారు శైలజ ఆగిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓ టర్లను ఓట్లు అభ్యర్థించారు. మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి ఓటర్లు ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ వారి గెలుపును బలపరుస్తున్నారు. తమ ఓటు హస్తం గుర్తుకు వేసి గెలిపిస్తామని భరోసా నిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లా డుతూ బురుజు కోట మైసమ్మ సాక్షిగా ఇచ్చి న మాట తప్పనని చేవెళ్ల సర్పంచ్ గా గ్రామ ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేస్తున్నారు. ప్రజలు మెచ్చేలా చేవెళ్ల మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు.
వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే చైర్మన్ సహకారంలో వార్డు రూపురేఖలు మార్చుతానని స్పష్టం చేశారు. ఆదరించిన ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, సేవ చేయడమే తనకు ముఖ్యమని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆమె వివరించారు. సంక్షేమ పథకాలకుప్రజలకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
చేసిన పనులు చెబుతూ..
హెచ్‌ఎండీఏ నిధులు రూ.15 కోట్లతో చేవెళ్లలో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్టు గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పట్ల ప్రజలకు ఉన్న ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తానని తెలిపారు. చేవెళ్లను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని నమ్మకంగా చెప్పారు. మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు శైలజ ఆగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 15వ వార్డు తరఫున తమను గెలిపిస్తే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.