calender_icon.png 10 February, 2026 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ 21వ వార్డులో గులాబీ గాలి

10-02-2026 01:13:32 AM

  1. నరాల శేఖర్‌కు పెరుగుతున్న ప్రజా మద్దతు

ఇంటింటికీ విస్తరించిన బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారం

గత సేవలు, అభివృద్ధి పనులే ప్రధాన అజెండా

అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్న వార్డు ప్రజలు

వేములవాడ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి ) :వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 21వ వార్డులో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో అధికారికంగా ముగిసింది. ప్రచారం చివరి రోజువరకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న నరాల శేఖర్ శరవేగంగా ప్రచా రం నిర్వహించారు. ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి చేరుకుని ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుంటూ మద్దతు కోరారు.

ప్రచారంలో భా గంగా గత పదేళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తన సతీమణి సౌజన్య కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తీసుకున్న చొరవను గుర్తు చేశారు. అలాగే తన హయాంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని పేర్కొన్నారు.ప్రచారం చివరి రోజు నరాల శేఖర్ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి నా బాధ్యతగా భావిస్తాను..

మీ ఇంటి బిడ్డగా మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి సాధిద్దాం అంటూ ఓటర్లను అభ్యర్థించారు.స్థానిక సమస్యలను ప్రా ధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఇక పలువురు వార్డు ప్రజలు శేఖర్ గత సేవలను ప్రస్తావిస్తూ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. మా ఓటు కారు గుర్తుకే. మా వార్డుకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి అని పేర్కొన్నారు.

ప్రచారం ముగిసే సమయానికి కనిపించిన ప్రజా స్పందన శేఖర్కు అనుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ప్రచారం ముగిసిన వేళ 21వ వార్డులో గులాబీ జెండా ఎగరడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్ రోజు ఫలితాలపైనే నిలిచింది.