2 May, 2026 | 7:08 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మట్కా టీమ్‌తో పబ్‌లో ..

19-07-2024 03:47 AM

నోరాఫతేహి మంచి నటి మాత్రమే కాదు డ్యాన్సర్, సింగర్ కూడా. బాలీవుడ్ విషయం కాస్త పక్కన పెడితే.. తెలుగులో తొలిసారి ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడి తన డ్యాన్స్ ‘టెంపర్’ ఎంతో చూపించింది. ‘బాహుబలి’లోనూ ప్రభాస్‌తో ప్రత్యేక గీతంలో మెరిసి ‘మనోహరి’ అనిపించుకుంది. మరికొన్ని సినిమాల్లోని పాటల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ భామ ప్రస్తు తం ‘మట్కా’లో వరుణ్ తేజ్‌తో ఆడిపాడుతోంది. మరి, నోరా అల్టిమేట్ డ్యాన్స్‌ను ఈ సినిమాలోనూ ఆశించవచ్చా అంటే, చిత్రబృందం నుంచి ఔననే సమాధానమే వస్తోంది.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘మట్కా’ బృం దం ప్రస్తుతం వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించింది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీన్స్ చిత్రీకరణ శరవేగం గా జరుగుతోంది. ఓ కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో సాంగ్ షూటింగ్ నిర్వహించగా, నోరా ఫతేహి పాల్గొన్నారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియో గ్రఫీ చేస్తున్నారు. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్లపాటు సాగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్లలో కనిపించనున్నారు. వరుణ్‌తో నోరాతోపాటో మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: ఎ.కిశోర్ కుమార్; దర్శకత్వం: కరుణ కుమార్; నిర్మాతలు: డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి.