calender_icon.png 20 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

20-01-2026 02:12:16 AM

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

బెజ్జంకి, జనవరి 19: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని మానకొండూరు ఎమ్మెల్యే క వ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి, చిలాపూర్ గ్రామాలలో బండిపెల్లి రాజవ్వ, కత్తి కనుకవ్వలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించీ మాట్లాడారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తామన్నారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. మండల ప రిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అ నంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శాలువా కప్పి సన్మానించారు, పార్టీలకతీతంగా సర్పంచులు గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మండల ఏఎంసి చైర్మన్ పులి కృష్ణ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో కాంగ్రె స్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, పులి కృష్ణతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో త హసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ప్రవీణ్, ఎం పిఓ మంజుల, ఏఈ రవళి,ఎస్‌ఐ సౌజ న్య, సర్పంచ్ బొల్లం శ్రీధర్,సతీష్, ఒగ్గు దా మోదర్, రత్నాకర్ రెడ్డి, జెల్ల ప్రభాకర్, రా వుల నర్సయ్య, బైర సంతోష్, ఏ.పోచయ్య, కర్రావుల శంకర్, నారాయణరెడ్డి, శనగొండ శరత్, శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.