13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గుండ్రెడ్డిపల్లి కొండపైన కనబడిన పులి

20-01-2026 02:11 AM

తూప్రాన్, జనవరి 19:6 నెలలుగా పులి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి మల్కాపూర్ మద్య మార్గములలో సంచరిస్తున్నదన్న భయాందోళనలో గ్రామస్తులు ఉండగా తిరిగి సోమవారం ఒక చిరుత గుండ్రెడ్డిపల్లి నుండి మల్కాపూర్ కు వెళ్లే మార్గ మధ్యలోని అడవి ప్రాంతము లోని ఒక పెద్ద గుండు పైన పడుకొని చూస్తున్న పులిని దారి గుండా వెలుతున్న ప్రయాణికులు వీక్షించి గ్రామస్తులకు సమాచారం అందించారు. పులులు పదేపదే అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉం డగా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వెలిబుచ్చారు.

అడవి ప్రాంతంలో పంట పొలాలు ఉన్న రైతులు పూర్తిగా పంట పొలాల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంలేదు, పశువుల కాపరులు తమ మందలను అడవిలోకి మేతకు తీసుకుపోవడం మానేశారు. ప్రయాణికులు సైతం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటు ప్రయాణాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పులులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేద ని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు. ఫారెస్ట్ అధికారులు కాపుకాసి సంచరిస్తున్న పులులను పట్టుకునే ప్రయత్నం చేసి అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు.