20-01-2026 02:13:26 AM
ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి
నారాయణఖేడ్, జనవరి 19 : మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే పి. సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో మహిళ స్వయం సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రూ.32 లక్షల, 36వేల,7వందల రుణాలను అందజేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ చీరలు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక రుణాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు.
మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని కోటీశ్వరులుగా ఎదగాలని కోరారు. అనంతరం ఆయా సంఘాలకు ప్రత్యేక చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, నాయకులు తాహెర్ అలీ, పండరి రెడ్డి, బాణాపురం రాజు, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.