నేడు బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు భవన ప్రారంభోత్సవం..
హైకోర్టు జడ్జి నగేష్ బీమపాక రాక
బెల్లంపల్లి, ఆగస్టు 21: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టు నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 22న కోర్టు భవనం ఆవిష్కరించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నగే ష్ భీమపాక ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లి సింగరేణి బి గెస్ట్ హౌజ్ భవనంలో కోర్టు కొనసాగుతుంది.
కన్నాల జాతీయ రహదారి డబుల్ బెడ్రూరూమ్ సముదాయం పక్కన నూతనంగా నిర్మించిన కోర్టు భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యా యమూర్తి శాంతిసోని, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నాయకులు పూర్తి చేశారు. అలాగే కోర్టు ఆవరణలో నిర్మించిన న్యాయమూర్తి నివాస భవన నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. ఈ కోర్టు ఆవిష్కరణ కార్యక్రమా నికి మంచిర్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏ. వీరయ్య, బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి శాం తి సోనీ, జిల్లాలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరు కానున్నారు.
నేడు మందమర్రి కోర్టు ప్రారంభం
మందమర్రికి నూతనంగా మంజూరైన జూనియర్ సివిల్ కోర్టు భవనం సైతం మందమర్రి వెంకటేశ్వర టెంపుల్ దగ్గరగా గల సింగరేణి సంస్థ సముదాయంలో ఏ ర్పాటు చేశారు. ఈ నూతన కోర్టు భవనాన్ని సైతం ఈ నెల 22న హైకోర్టు న్యాయమూర్తి నగేష్ బీమపాక చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతా ల్లోనీ ప్రజలకు ఈ రెండు సివిల్ కోర్టులు నూతన న్యాయ సేవలు అందించనున్నాయి.






