ప్రజల భద్రతే ధ్యేయం
- సీపీ సుమతి నేతృత్వంలో మల్కాజిగిరి పోలీసింగ్‌కు కొత్త గుర్తింపు
- నేర నియంత్రణలో దూకుడు
- మహిళల భద్రతకు ప్రాధాన్యం
- సైబర్ నేరాలపై ఉక్కుపాదం
- సెల్ఫోన్ రికవరీల్లో రాష్ట్రంలోనే ముందంజ
ఉప్పల్, ఆగస్టు 21 (విజయక్రాంతి): మ ల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ను ప్రజలకు మ రింత చేరువ చేస్తూ, సమర్థవంతమైన పోలీసింగ్తో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసు కొస్తున్నారు పోలీస్ కమిషనర్ బడుగుల సు మతి. ప్రజల భద్రత, నేర నియంత్రణ, మహిళల రక్షణ, సైబర్ నేరాల అరికట్టడం, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాల్లో ఆమె నాయకత్వంలో కమిషనరేట్ విశేష ఫలితాలు సాధిస్తోంది.
సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం
సీపీ సుమతి బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిషనరేట్ పరిధిలో ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన పెరిగింది. ప్రతి ఫి ర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని బాధితులకు న్యాయం అందించే దిశగా పోలీసులు పనిచేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖపై ప్రజ ల విశ్వాసం మరింత బలపడుతోంది.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ సుమతి, బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అర్ధరాత్రి సామాన్య మహిళ వేషంలో స్వ యంగా నగర వీధుల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చర్య ద్వారా మహిళలు ఎదు ర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనిపోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టారు.
మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, ఐటీ సంస్థలు, కాలనీల్లో విస్తృత అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు.
సైబర్ నేరాల అవగాహన
ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ నే రాల నేపథ్యంలో సైబర్ అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్లు, సోషల్ మీడియా మోసాలు, ఫేక్ లింకులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాధితులకు సహాయ స హకారాలు అందిస్తున్నారు.
డ్రగ్స్ నిర్మూలన
డ్రగ్స్ నిర్మూలనలోనూ మల్కాజిగిరి పో లీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తూ, మాదకద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసా గిస్తున్నారు.
కార్మిక వ్యవస్థ నిర్మూలన, మి స్సింగ్ పిల్లల గుర్తింపు వంటి అంశాల్లో ప్ర త్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ విశేష ఫలితాలు సాధిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వం దలాది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు చేర్చడం పోలీసుల సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
పోర్టల్ ద్వారా ఫోన్‌లో గుర్తింపు
సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను గుర్తించి యజమానులకు తిరిగి అందించడంలో కమిషనరేట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. వందలాది మంది బాధితులకు వారి సెల్ఫోన్లు తిరిగి అందజేసి ప్రజల ప్రశంసలు అందుకుంది.
ఎక్కడ చేసినా అదే గుర్తింపు..
సీపీ సుమతి గతంలో ఇంటెలిజెన్స్, మ హిళా భద్రత, ఉగ్రవాద నిరోధక విభాగాల్లో విశేష సేవలు అందించారు. తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియలో కీ లక పాత్ర పోషించి సమర్థ అధికారిణిగా గుర్తింపు పొందారు
ఆదర్శంగా నిలుస్తున్న కమిషనరేట్
ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవడం, ప్రతి ఫిర్యాదుపై స్పందించడం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం, బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో సీపీ సుమతి చూపుతున్న చొరవతో మల్కాజిగిరి కమిషనరేట్ ప్రజా పోలీసింగ్కు ఆదర్శంగా నిలుస్తోంది ప్రజల విశ్వాసమే పోలీసుల బలం. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరరహిత సమాజ నిర్మాణమే మా లక్ష్యం అనే సీపీ సుమతి సంకల్పంతో మల్కాజిగిరి పోలీసింగ్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.
‘భద్రత సేవ విశ్వాసం’ అ నే లక్ష్యంతో పారదర్శక పోలీసింగ్‌కు మార్గదర్శకంగా నిలుస్తున్న సీపీ సుమతి నాయక త్వం మల్కాజిగిరి కమిషనరేట్‌కు ప్రత్యేక గు ర్తింపును తీసుకొచ్చిందని ప్రజలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.






