ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ఇంటినిర్మాణం కోసం 15వేలు డిమాండ్
- 13వేలు ఫోన్ పే, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
జన్నారం, ఆగస్టు 21 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జన్నారం మండలంలోని లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మిలంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
అవినీతి నిరోధక శాఖ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం లింగయ్యపల్లె గ్రామపంచాయితీ పరిధిలో నూతనంగా నిర్మించుకునే ఇంటి అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మీ బాధితుడు సంప్రదించగా రూ. 15 వేలు డిమాండ్ చేసింది. రూ. 13 వేల కు ఒప్పుకుంది.
ఆ డబ్బులను పంచాయ తీ సెక్రటరీకి ఇచ్చేందుకు వెళ్లగా నేరుగా తీసుకోకుండా తన స్నేహితుడికి ఫోన్ పే చేయాలని కోరడంతో బాధితుడు ఫోన్ పే చేశాడు. ఫోన్ పే నెంబర్ వివరాలతో పా టు పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభు త్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే 10 64 లేదా 91543 88963కి సమాచారం అందించాలని అధికారులు కోరారు.






