6 March, 2026 | 2:57 AM

నూతన ప్రజాప్రతినిధులు పారదర్శకంగా నిబద్ధతతో పనిచేయాలి

05-03-2026 12:00 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

దమ్మపేట, మార్చి 4 (విజయక్రాంతి):  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని మల్లారం రైతు వేదిక నందు మండల స్థాయిలో ఏర్పాటు చేసి శిక్షణా తరగతులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి మొదటి మెట్టు అని,  అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యమని, గ్రామాల్లో పారదర్శకంగా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలని, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు.

మూడువిడతలుగా నిర్వహించనున్న ఈ శిక్షణలో గ్రామపాలన విధానం, నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రవికుమార్, ట్రైనింగ్ ఆఫీసర్లు రాజేశ్వరరావు,  రామ్మూర్తి, దమ్మపేట గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, పగడాల రాంబాబు, చిన్నశెట్టి యుగంధర్,  పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.