టీఆర్పీలో మైనార్టీల చేరిక
27-02-2026 12:00 AM
ఆహ్వానించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన మైనార్టీ ప్రముఖులు గురువారం టీఆర్పీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారిలో నస్రీన్ సుల్తాన, ఎం.డి. రహమత్, ఎం.డి. జమీల్ ఉన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్ని అణగారిన వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాబోయే ప్రభుత్వంలో మైనార్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు.




