17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మెడికవర్‌లో అరుదైన చికిత్స

27-02-2026 12:00 AM

కీళ్ల నొప్పులకు ‘లో-డోస్ రేడియోథెరపీ’

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. లో-డోస్ రేడియోథెరపీ కీళ్లలోని దీర్ఘకాలిక వాపును తగ్గిం చి, నొప్పిని నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నదని చెప్పా రు. ‘ఇది పూర్తిగా నాన్-ఇన్వేసివ్ విధానం. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా అవుట్పేషెంట్ పద్ధతిలో చికిత్స పొందవచ్చు.

గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 ఆస్టియో ఆర్థరైటిస్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుం ది’ అని తెలిపారు. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, ఎల్‌డీఆర్‌టీ ద్వారా కీళ్ల కదలికలు మెరుగుపడటమే కాకుండా, నొప్పి నుంచి గణనీయమైన ఉపశమనం లభిస్తున్నట్టు వెల్లడైంది. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు నిపుణుల సలహా మేరకు ఈ ఆధునిక చికిత్సను వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.